top of page

నార్త్ వాళ్లతో పోలిస్తే మాకేం తక్కువ..


బాహుబలి సినిమా రాకముందు వరకూ సౌత్ ఇండస్ట్రీపై బాలీవుడ్‌కి చిన్నచూపు ఉండేది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా సందర్భాల్లో ఇది రుజువైంది. కానీ బాహుబలి తర్వాతి నుంచి దక్షిణాదిని బాలీవుడ్ చూసే దృష్టే మారిపోయింది. ఎందుకంటే ఆ తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన చాలా సినిమాలు పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపేశాయి. ఆర్ఆర్ఆర్ సినిమా అయితే ఏకంగా ఆస్కార్ కూడా తెచ్చిపెట్టింది. దీంతో దక్షిణాది నటీనటులు, టెక్నీషియన్లపై బాలీవుడ్ స్టార్స్ అందరూ ప్రశంసలు కురిపించడం తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ కొంతమంది బాలీవుడ్ Vs సౌత్ అంటూ సోషల్ మీడియాలో చర్చ చేస్తూనే ఉంటారు. తాజాగా దీనిపై హీరోయిన్ ప్రియమణ కూడా స్పందించారు. 

"నా దృష్టిలో నార్త్-సౌత్ అనే తేడా ఏం లేదు. ఎందుకంటే ప్రస్తుతం దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు. అలానే చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ ఇప్పుడు సౌత్ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం ఇప్పటికీ సౌత్‌ ఇండియాకి సంబంధించిన పాత్ర కాబట్టే మీకు ఛాన్స్ ఇస్తున్నామంటూ మాట్లాడుతుంటారు. కానీ త్వరలోనే ఈ ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము దక్షిణాది వాళ్లమే అయినా హిందీ బాగా మాట్లాడగలం. డైలాగులు చెప్పేటప్పుడు గ్లామర్‌ తప్పులు దొర్లినా ఎమోషన్స్‌ను బాగా పండించగలం. అలానే అందంగా కూడా ఉంటాం. కాకపోతే మా కలర్ నార్త్‌ వాళ్లంత ఫెయిర్‌గా ఉండదంతే. కానీ అది పెద్ద విషయం కాదు. అయినా నార్త్, సౌత్ అని తేడా చూడకూడదు.. ఎందుకంటే అందరూ భారతీయులమే" అంటూ ప్రియమణి అన్నారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రియమణి చెప్పినదాన్ని చాలా మంది నెటిజన్లు గౌరవిస్తున్నారు. మనలో మనం కొట్టుకోవడం మానేసి ప్రపంచంతో పోటీ పడాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

bottom of page