top of page

సెన్సార్ కోసం రూ.6.5 లక్షలు లంచం తీసుకున్నారు.. హీరో విశాల్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముంబై కార్యాలయంపై హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’ హిందీ వర్షన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సీబీఎఫ్‌సీ ముంబై ఆఫీసులో లంచం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముంబై కార్యాలయంపై హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’ హిందీ వర్షన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సీబీఎఫ్‌సీ ముంబై ఆఫీసులో లంచం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ‘మార్క్ ఆంటోని’ హిందీ వెర్షన్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడడంతో చేసేదేమీ లేక తాను రూ.6.5 లక్షలు లంచం ఇచ్చానని విశాల్ అన్నారు. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ నిర్మాతకు రాకూడదని ఈ విషయాన్ని బయటపెడుతున్నానని ఒక వీడియో మెసేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు.

రెండు దఫాలుగా రూ.6.5 లక్షలను పంపామని విశాల్ చెప్పారు. రూ.3 లక్షలు ఒక బ్యాంక్ అకౌంట్‌లో, మరో రూ.3.5 లక్షలు మరో బ్యాంకు ఖాతాలో వేసినట్టు వివరించారు. ఆ బ్యాంకు ఖాతాల వివరాలు కూడా విశాల్ బయటపెట్టారు. ఈరోజే సినిమా విడుదల ఉండడంతో ఏమి చేయాలో తెలియక, సమయం లేక తాము రూ.6.5 లక్షల లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సినిమాను స్క్రీనింగ్ చేయడానికి రూ.3 లక్షలు, సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ.3.5 లక్షలు చెల్లించినట్టు చెప్పారు. కానీ, భవిష్యత్తులో ఎవరికీ తనలాంటి పరిస్థితి రాకూడదని ఈ అవినీతి గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొస్తున్నానని వెల్లడించారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా అవినీతిపరుల చేతుల్లో పెట్టాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ అవినీతికి పాల్పడినవారిపై నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటారని, న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page