top of page
MediaFx

హసీనాను రప్పించేందుకు చర్యలు..


బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను భారత్‌ నుంచి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆ దేశానికి చెందిన ‘ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్‌’ ఆదివారం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారని హసీనా సహా పలువురిపై తాత్కాలిక ప్రభుత్వం కేసుల్ని నమోదు చేసింది. వీటి విచారణ కోసం ఆమెను రప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ‘హసీనా సహా పరారీలో ఉన్న వారందరికీ అరెస్టు వారెంట్‌ జారీ చేయాలంటూ ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేయబోతున్నాం. ఇరు దేశాల మధ్య నిందితుల అప్పగింతపై ఒప్పందం ఉంది’ అని ట్రిబ్యునల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ తాజుల్‌ ఇస్లామ్‌ చెప్పారు.


bottom of page