top of page
Shiva YT

‘క్యాన్సర్‏ను ఓడించిన చిన్నారి.. మాట నిలబెట్టుకున్న సల్మాన్ ఖాన్.’ 🦸‍♂️

‘బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే టైగర్ 3 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. 🌟 ఇందులో కత్రీనా కైఫ్ నటించింది. వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ సల్మాన్ సూపర్ హీరో. 🦸‍♂️

మంచితనం, సాయం చేయడంలో ముందుంటాడు. తన అభిమానులకు ఎన్నో రకాలుగా సాయమందిస్తుంటారు. 🤲 అందుకే ఆయనను అంతా భాయ్ జాన్ అని పిలుస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ 9 ఏళ్ల చిన్నారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు సల్మాన్. 4 ఏళ్ల వయసులో అతడికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మరోసారి కలిసి ధైర్యం చెప్పాడు. 🗣️ అసలు విషయానికి వస్తే.. మహారాష్ట్రలోని ముంబైలో నివసిస్తున్న జగన్బీర్ అనే 4 ఏళ్ల బాలుడు 2018 నుంచి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. 🩹 ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ లో జగన్బీర్ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆ సమయంలో అతడు సల్మాన్ ఖాన్ చూడాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. 📹 ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా… ఇది చూసిన సల్మాన్ వెంటనే ఆ బాలుడిని కలుసుకున్నాడు. 💖’

bottom of page