top of page
Shiva YT

తిరుమల కొండపై రాత్రి 1.37గం.లకు బోనుకి చిక్కిన చిరుత.. 🌙🕐🦉

తిరుమల కొండపై ఆపరేషన్ చిరుతలో భాగంగా రెండో చిరుత బోనుకి చిక్కింది. నామాలగవిలో రాత్రి సంచరించిన చిరుత.. సరిగ్గా 1:37 గంటలకు బోను దగ్గరికి వెళ్లింది.

ఎరగా వేసిన కుక్కను వేటాడేందుకు చిరుత బోనులోకి వెళ్లింది. అంతలోనే బోను క్లోజ్‌ అయింది. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బోనులో బంధీ అయిన చిరుతను ఉదయం జూకి తరలించారు అధికారులు. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. 🏥🚑🌄

లక్షితపై ఎక్కడైతే దాడి జరిగిందో.. రెండో చిరుత కూడా సరిగ్గా అక్కడికే వెళ్లింది. నామాలగవి అత్యంత సమీపంలో రాత్రి 2గంటల సమయంలో బోనులో చిక్కింది. 🌠🕒💤

కాగా, భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే చిరుతల్ని బంధిస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. భక్తులకు కర్రల పంపిణీపై వచ్చే విమర్శల్ని కొట్టిపడేశారు భూమన. నిపుణులు, అధికారుల సూచనల మేరకే కర్రలు ఇస్తున్నామన్నారు. బోనులో చిరుత చిక్కిన దృశ్యాలపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని.. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. 🕊️🙏🎙️

bottom of page