top of page
Suresh D

ఏ బ్లడ్‌ గ్రూప్‌ వారు ఏ ఆహారం తీసుకోవాలో తెలుసా.?💉🥩

మనిషి తీసుకునే ఆహారంపైనే అతడి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మంచి ఆరహారం తీసుకోవాలి. అయితే తీసుకునే ఆహారం బ్లడ్ గ్రూప్‌పై కూడా ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా.?

మనిషి తీసుకునే ఆహారంపైనే అతడి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మంచి ఆరహారం తీసుకోవాలి. అయితే తీసుకునే ఆహారం బ్లడ్ గ్రూప్‌పై కూడా ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా.? అవును.. మన బ్లడ్ గ్రూప్‌ను బట్టి తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మనిషి బ్లడ్ గ్రూప్‌ ప్రకారం మనం తీసుకునే డైట్‌లో మార్పులు చేసుకోవాలని చాలా పరిశోధనల్లో తేలింది. బ్లడ్‌ గ్రూప్‌ ప్రకారం ఆహారం తీసుకుంటే.. శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవితంతో పాటు జీవిత కాలం కూడా పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం. ఇంతకీ ఏ బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లు, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..💉🍽️

ఓ బ్లడ్‌ గ్రూప్‌..

‘ఓ’ బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతన్నారు. వీరు ఎక్కువగా మాంసం, చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. అలాగే బీన్స్‌, చిక్కుళ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. సీ ఫుడ్, సీ ప్లాంట్, బ్రోకలీ, బచ్చలికూర, ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఓ బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లు బరవు తగ్గొచ్చు. ఇక ఓ బ్లడ్ గ్రూప్‌ వాళ్లు.. గోధుమలు, మొక్కజొన్న, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండడమే మంచిది.

‘ఏ’ బ్లడ్ గ్రూప్‌..

ఇక ‘ఏ’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు కూడా పండ్లు, కూరగాయలు, సీ ఫుడ్, తృణధాన్యాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారు సీ ఫుడ్‌, కూరగాయలు, పైనాపిల్‌, ఆలివ్‌ ఆయిల్‌, సోయా వంటివి తీసుకోవాలి. ఇక డైరీ, గోధుమలు, మొక్కజొన్న, కిడ్నీ బీన్స్ వంటివి తీసుకోకూడదు.

‘బీ’ బ్లడ్‌ గ్రూప్‌..

‘బీ’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వ్యక్తులు మాసం, పండ్లు, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్‌తో పాటు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లు బరువు తగ్గాలనుకుంటే.. పచ్చి కూరగాయలు, గుడ్లు, లివర్, లైకోరైస్ టీ తాగాలి.

‘ఏబీ’ బ్లడ్‌ గ్రూప్‌..

‘ఏబీ’ బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లు.. డైరీ, చేపలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏబీ బ్లడ్‌ గ్రూప్‌ వారు.. చికెన్, మొక్కజొన్న, బీన్స్‌ వంటి వాటిని తీసుకోవాలి.💉🍽️🥩

bottom of page