విస్టెక్స్ ఏషియా సాఫ్ట్‌వేర్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఈవో సంజయ్ షాతోపాటు పలువురు కంపెనీ అధికారులు హాజరయ్యారు.
కార్యక్రమానికి వచ్చిన అతిథులను స్టేజ్ పైకి 20 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ సాయంతో కిందికి దింపడానికి రెండు వైపులా 6MM మందం కలిగిన ఇనుప తీగలను అమర్చారు. ఈ క్రమంలో కంపెనీ సీఈవో సంజయ్ షా, ఛైర్మన్ విశ్వనాథ రాజును క్రేన్ సాయంతో కిందికి దింపుతున్న సమయంలో ఈ రెండు తీగల్లో ఒకటి ఆకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో వారిని తీసుకువెళుతున్న క్రేన్ కంపార్ట్‌మెంట్ కూలిపోయింది. ఈ ఘటనలో కంపెనీ సీఈవో సంజయ్ షా మృతి చెందారు. ఛైర్మన్ విశ్వనాథ రాజు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాంటి చోట తాజాగా ప్రమాదం చోటు చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు ప్రమాదానికి గురైన వ్యక్తులను కారులో తీసుకెళ్ళారు అక్కడ సరైనా అంబులెన్స్ కూడా లేని పరిస్థితి...