top of page

నథింగ్‌ నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.


నథింగ్ సబ్‌ బ్రాండ్‌ అయిన సీఎమ్‌ఎఫ్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌1 పేరు జులై8వ తేదీ మధ్యాహ్నం ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ నేథ్యంలో ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌1లో 6.67 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో పాటు హెచ్‌డీ10+ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ రానుంది. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌పెస్‌ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇక ఈ ఫోన్‌లో ఐపీ52 రేటింగ్‌తో డస్ట్‌, లైట్‌ స్ల్పాషెస్‌ను తట్టుకునేలా డిజైన్‌ చేశారు. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అందించనున్నారు. 128 బీజీ స్టోరేజ్‌ కెపాసిటీతో రానున్న ఈ ఫోన్‌లో ఇంటర్నల్ మెమోరీని 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్లపాటు ఆపరేటింగ్ సిస్టమ్‌ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్‌ రానుంది. ఇక మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇవ్వనున్నారు కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు ధర పరంగా చూస్తే 6 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,999కాగా.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 17,999గా ఉండొచ్చని అంచనా.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page