top of page

క్రీడలతో అందమైన జీవితం..


డబుల్‌ ఒలింపియన్‌ మను భాకర్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో కొత్త చరిత్ర లిఖించిన యువ షూటర్‌ మను భాకర్‌..తన విజయాన్ని ఆస్వాదిస్తున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్న భాకర్‌ ఎక్కడికి వెళ్లినా అపూర్వ ఆదరణ దక్కుతున్నది. మంగళవారం చెన్నైలో వేలామ్మాల్‌ నెక్సస్‌ స్కూల్‌ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాకర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులును ఉద్దేశిస్తూ భాకర్‌ మాట్లాడుతూ ‘టోక్యో ఒలింపిక్స్‌తో నా షూటింగ్‌ ప్రయాణం మొదలైంది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ షూటర్‌గా పోటీకి దిగిన నేను స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాను. ఓడిపోవడానికి, గెలువడానికి ఉన్న తేడా ఏంటో నాకు తెలుసు. ఇది క్రీడల్లో ఉన్న అద్భుతం. ఒకసారి ఓడితే మరోసారి గెలువచ్చు. కానీ అదంతా మనం పడే కష్టంపైనే ఆధారపడి ఉంటుంది. క్రీడలను కెరీర్‌గా ఎంచుకోండి. కలలు సాకారం చేసుకోవాలంటే అందుకు బాగా కష్టపడాలి. మనకు కెరీర్‌లో చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి. క్రీడల్లో అద్భుతమైన జీవితం ఉంది. ఆర్థిక మద్దతుతో పాటు అన్ని రకా లు మనం క్రీడల ద్వారా పొందవచ్చు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి నా తల్లే కారణం. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ఎవరైనా ఏదైనా సాధించాలంటే ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్‌లో టీచర్ల మద్దతు తప్పనిసరిగా కావాలి’ అని అంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page