top of page
MediaFx

మళయాళంలో అదరగొడుతున్న షెకావత్ సినిమా..


దక్షిణాది సినిమా దగ్గర మంచి ఫేమ్ ఉన్నటువంటి సాలిడ్ పెర్ఫామర్ లలో విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా ఒకరు. మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో “పుష్ప” లో భన్వర్ సింగ్ షెకావత్ గా టాలీవుడ్ ఆడియెన్స్ కి మరింత సుపరిచితం అయ్యిన తాను లేటెస్ట్ గా మళయాళ సినిమా దగ్గర సత్తా చాటుతున్నాడు. దర్శకుడు జిత్తు మాధవన్ తెరకెక్కించిన ఆ చిత్రమే “ఆవేశం”. మరి ఈ చిత్రం ఓపెనింగ్ నుంచే సాలిడ్ వసూళ్లు అందుకుంటూ వస్తుండగా ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో 74 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో రీసెంట్ గా వచ్చిన పలు చిత్రాల సరసన ఈ సినిమా కూడా ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ కి వెళ్లబోతుంది. అలాగే ఈ సినిమా తమిళ నాట కూడా ప్రేమలు లైఫ్ టైం వసూళ్ళని క్రాస్ చేస్తుందట. అలాగే రెండో వారాంతానికి ఈ చిత్రం 11 కోట్ల గ్రాస్ తో 2018 సినిమా వసూళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తుందట. మొత్తానికి అయితే ఈ చిత్రంతో ఫహద్ భారీ హిట్ అందుకున్నాడని చెప్పాలి. ఇక లైఫ్ టైం వసూళ్లు ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.

bottom of page