top of page
MediaFx

ఆ ఒక్కటి అడక్కు రివ్యూ..


అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. బ్యాక్ టు బ్యాక్ సీరియస్ సినిమాలతో హిట్స్ అందుకున్న నరేష్... వాటికి ముందు తనకు ఎక్కువ విజయాలు అందించిన కామెడీ జానర్ సినిమా చేయడంతో ప్రేక్షకుల చూపు పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.

ఆ ఒక్కటీ అడక్కు... క్లాసిక్ టైటిల్. ఆ టైటిల్ తీసుకోవడం సాహసం. పైగా, ఆ సినిమా తీసిన ఈవీవీ తనయుడు 'అల్లరి' నరేష్ నయా 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాలో హీరో కావడం, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని చెప్పడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రామిసింగ్ ట్రైలర్, పెళ్లి కాని యువకుల కష్టాలు అనే కాన్సెప్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. మరి, సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...

ఆ ఒక్కటీ అడక్కు... అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ అయితే కాదు! ఆ టైటిల్ తీసుకుని కామెడీ కోటింగ్ ఇస్తూ సీరియస్ సినిమా తీశారు. ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు ఫేస్ చేసే ప్రాబ్లమ్... సరైన పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించడం! పెళ్లైన అమ్మాయిల నంబర్లను మ్యాట్రిమోనీ సైట్లు అబ్బాయిలకు ఇవ్వడం, మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురు అవుతున్నాయనేది చూపించారు. అయితే... సీరియస్ ఇష్యూ మధ్యలో కామెడీ తగ్గింది.

పెళ్లి కాని యువకుడిగా అల్లరి నరేష్ ఇంట్రో, మరదలిగా జెమీ లివర్ సన్నివేశాలు సరదా సరదాగా ముందుకు వెళతాయి. డైనింగ్ టేబుల్ దగ్గర వెన్నెల కిశోర్ సీన్ హిలేరియస్‌గా నవ్విస్తుంది. అయితే... ఆ తర్వాత కథలో కామెడీ తగ్గింది. సీరియస్ ఇష్యూ డిస్కషన్ ఎక్కువైంది. అదంతా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.

తమ్ముడికి ముందు పెళ్లి చేసి తాను ఎందుకు చేసుకోలేదు? అని హీరోయిన్ వేసిన ప్రశ్నకు చూపించిన అల్లరి నరేష్ ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకోలేదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలను టచ్ చేశారు. కథలో విషయం ఉంది. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కొత్తది. కానీ, దాని చుట్టూ కామెడీ జనరేట్ చేయడంలో 'ఆ ఒక్కటీ అడక్కు' టీమ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాలేదు. 

గోపీసుందర్ పాటల్లో 'రాజాది రాజా....' బావుంది. పిక్చరైజేషన్ కూడా బావుంది. కానీ మిగతా పాటలు ఆ స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సాధారణ సీన్లు తీయడానికి గ్రీన్ మ్యాట్ ఎందుకు వాడారో అర్థం కాలేదు. ఆ డిఫరెన్స్ స్క్రీన్ మీద తెలుస్తుంది. అయితే... ప్రొడక్షన్ విషయంలో నిర్మాతలు రాజీ పడలేదని కొన్ని సీన్లు చూస్తే అర్థం అవుతుంది.


bottom of page