top of page
Suresh D

అది ఫేక్ వీడియో.. పోలీసులను ఆశ్రయించిన స్టార్ హీరో..🎥🚫


బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ షూటింగ్‏తో బిజీగా ఉన్నారు. లాల్ సింగ్ చద్దా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమీర్ ఖాన్‏కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అమీర్ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. గత రెండు మూడు రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన అమీర్ ఖాన్ ఆ వీడియో ఫేక్ అంటూ చెప్పుకొచ్చారు. గత 35 ఏళ్ల సినీ కెరీర్‏లో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీని ఆమోదించలేదని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని అన్నారు.ప్రస్తుతం తాను రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్న వీడియో వైరలవుతుందని.. అది పూర్తిగా ఫేక్ వీడియో అని అన్నారు. దీనిపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు.🎥✨


bottom of page