top of page

ఆదిపురుష్ అంటార్రా…బాబు

ముందు రిలీజ్ అయిన ఆదిపురుష్ టీజర్ వరస్ట్ 😬 అని అటు ఆడియన్స్ ఇటు సోషల్ మీడియా ఎంత ట్రోల్ చేసినా, ట్రైలర్ వచ్చేసరికి “ఓం కం టు మై రూమ్ ఎఫెక్ట్ “ ఏమో తెలీదు కానీ మొత్తం మారిపోయింది .

ఆదిపురుష్ కథ .ముందు ఛీ 🤧 అన్నవాళ్ళే జై శ్రీరామ్ అంటున్నారు ఇప్పుడు . దీనికి సాక్ష్యం ఆదిపురుష్ టికెట్ బుకింగులే.ఒక్క హిందీ లోనే 2D & 3D కలుపుకొని ఏకంగా 4 కోట్ల ఫస్ట్ డే బుకింగ్స్ అయ్యాయి. తెలుగులో ఇప్పటివరకు 1 కోటి 3D బుకింగ్స్ అయ్యాయి . ఓవర్సీస్ కూడా తక్కువేం కాదు , మొదటి రోజుకు గాను 16000 డాలర్స్🤑 బుకింగ్స్ అయ్యాయట . దీనికి తోడు ఆల్రెడీ రణభీర్ కపూర్ ఇంకా మంచు విష్ణు లాంటివాళ్లు చెరి 10000 టికెట్స్ అనాథ పిల్లలకోసం బుక్ చేసారు. అంతేకాకుండా శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ ఖమ్మం జిల్లాలో ని ప్రతి రామాలయానికి 100 టికెట్స్ ప్రకటించారు . మరి ఇదంతా రాముడి దయో లేక ప్రభాస్ మానియానో తెలీదు కానీ ఆదిపురుష్ మాత్రం చాలా హై ఎక్స్ పెక్టేషన్ తో ఈ నెల 16 కి థియేటర్స్ కు వస్తుంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page