top of page

థియేటర్స్ ని సందడి చేయనున్న ఆదిపురుష్..

రామాయణ ఆధారిత చిత్రం ఆదిపురుష్‌ రిలీజ్ అవ్వటానికి కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. ఈ చిత్రం ఒక్క హిందీలోనే దాదాపు 4000 ప్లస్ స్క్రీన్లలో మరియు అన్ని భాషల్లో దాదాపు 6200 స్క్రీన్లలో విడుదలవుతోంది.

ఆదిపురుష్ యుఎస్ ప్రీమియర్స్ ఈరోజు రాత్రి జరగనున్నాయి, ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. దీని రన్‌టైమ్ 2 గంటల 59 నిమిషాలు, ఆదిపురుష్ సెన్సార్ బోర్డ్ నుండి U/A సంపాదించింది .ఇప్పటివరకు బుక్ ఐన టిక్కెట్ల ప్రకారం, ప్రభాస్ యొక్క ఆదిపురుష్ మొదటి రోజు కనీసం 25+ కోట్లు హిందీలోనే వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు వాళ్ళ టీం . నివేదికల ప్రకారం, ఆదిపురుష్ హిందీ వెర్షన్ కోసం ఇప్పటికే ఒక కోటి టిక్కెట్లు అమ్ముడయ్యాయి, SRK బ్లాక్‌బస్టర్, పఠాన్ దా మొదటి రోజు 5.56 లక్షల టిక్కెట్లను విక్రయించింది .దాదాపు 50+ కోట్లు వసూలు చేసింది. మరి కోటి టిక్కెట్లు అమ్ముడుపోయిన ఆదిపురుష్ ఎంత కలెక్ట్ చెయ్యాలి అని బాక్స్ ఆఫీస్ క్రిటిక్స్ లెక్కలు వేస్తున్నారు . భారీ బడ్జెట్, హైప్ మరియు స్టార్ వాల్యూ ఉన్న ఆదిపురుష్ దాని ఫలితంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద చాల ఈజీగా 25 కోట్లు మొదటి రోజే కొడుతుందని అంటున్నారు విశ్లేషకులు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page