top of page

హైదరాబాద్‌లో రేండేళ్లు నడిచిన సినిమా..


సల్మాన్‌ ఖాన్‌, మాధురి దీక్షిత్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఊహకందని విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సల్మాన్‌ కెరీర్‌కు ఈ సినిమా బూస్ట్‌ను ఇచ్చించి ఫుల్ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సూరజ్‌ భరత్యాజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ఈ సినిమా కోట్ల రూపాయలు రాబట్టి అరుదైన రికార్డును దక్కించుకుంది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందంటే.. ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నటి విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి. ఫుల్‌ రన్‌టైమ్‌లో ఈ సినిమా రూ. 100 కోట్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా హైదరాబాద్‌లో ఓ అరుదైన ఘనతను సాధించింది. ఈ సినిమా హైదరాబాద్‌లో ఏకంగా 2 ఏళ్లు సక్సెస్‌ ఫుల్‌గా నడిచిందని మీకు తెలుసా.? హైదరాబాద్‌ కాచిగూడలోని ఐకానిక్‌ మహేశ్వరీ థియేటరల్లో ఈ సినిమా 100 రోజుల్లో నడిచి రూ. 68,06,356 వసూళ్లు రాబట్టి ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ను సృష్టించింది. కాగా మధ్యలో షోలో మూవీ విడుదల కారణంగా సినిమాను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఆ తర్వాత మళ్లీ విడుదల చేశారు. ఇలా ఈ సినిమా ఏకంగా ప్రతీ రోజూ మూడు షోలతో 413 రోజులు నడించింది. ఆ తర్వాత మళ్లీ ఈ సినిమా కాచిగూడలోని ఐకానిక్‌ మహేశ్వరీ థియేటర్‌లో సింగిల్‌ షోతో కలుపుకొని 651 రోజులు నడించింది. ఇలా ఈ సినిమా ఒకే థియేటర్‌లో ఏకంగా దాదాపు రెండేళ్లు నడవడం విశేషం. సల్మన్‌ ఖాన్‌కి ఆ సమయంలోనే హైదరాబాద్‌, నైజాం ఏరియాలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇన్ని అరుదైన రికార్డులను సృష్టించింది కాబట్టే 30 ఏళ్లు గడుస్తోన్నా ఈ సినిమా ఇప్పటికీ వార్తల్లో నిలిచింది.



Comments


bottom of page