top of page

అసలు అక్కడ ఉన్నది ఎవరు?..ఫన్నీ ట్రోల్స్, మీమ్స్..

సమంత అభిమాని ఒకరు ఆమెకు గుడి కట్టించిన సంగతి తెలిసిందే. సమంత బర్త్ డే సందర్భంగా నిన్న ఈ గుడిని ప్రారంభించాడు. గుడి ఓకే కానీ.. అందులో సమంత ఎక్కడుంది? అంటూ ట్రోల్స్, మీమ్స్‌తో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

Samantha Statue Meme : అభిమానం ఒక్కోసారి పిచ్చి, వెర్రితనానికి దారి తీస్తుంటుంది. ఇక హీరో హీరోయిన్లకు గుళ్లు కట్టించడం అనేది ఇప్పుడు కామన్ అయింది. తమిళంలో ఇలాంటి గుళ్లు కట్టే సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. కుష్బూ, హన్సిక, రజినీ, నిధి అగర్వాల్ వంటి వారికి అక్కడ గుళ్లు కట్టేశారు. ఇప్పుడు ఈ పద్దతి తెలుగులోకి కూడా వచ్చినట్టు అనిపిస్తోంది. ఓ అభిమాని సమంతకు గుడి కట్టించాడు. శుక్రవారం నాడు సమంత బర్త్ డే సందర్భంగా ఈ గుడిని ప్రారంభించాడు.సమంత గుడి, ఆ గుడిలోని సమంత విగ్రహం మీద ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి. అసలు సమంతలా లేదని, ఆ విగ్రహం ఎవరిదని నెటిజన్లు కౌంటర్లతో హల్చల్ చేస్తున్నారు. ఇక ఫన్నీ మీమ్స్‌ అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గుడి ఓకే కానీ.. సమంత ఎక్కడుంది.. నువ్ సమంత అని చెప్పే వరకు నాకు తెలియలేదు బ్రో అంటూ ఇలా నానా రకాలుగా కౌంటర్లు వేస్తున్నారు.ఏయ్ నవ్వొద్దు సీరియస్ అంటూ బాలయ్య మీమ్స్‌ను వాడేస్తున్నారు. ఇక బ్రహ్మానందం స్టిల్స్‌ను వాడుకుంటూ ఈ విగ్రహం మీద నానా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. నిన్న సమంత బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ నుంచి విషెస్ అందాయి. అయితే టాప్ హీరోలు ఎవ్వరూ కూడా సమంతకు సోషల్ మీడియాలో విషెస్ అందించలేదు. ఒక్క రామ్ చరణ్‌ మాత్రమే విషెస్ చెప్పాడు. సాయి ధరమ్ తేజ్, రామ్ వంటి హీరోలు సైతం విషెస్ చెప్పారు.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page