top of page

తెలంగాణ ఒగ్గు కథే హైలైట్‌గా.. యేవమ్‌

సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే కథలను ఎంచుకొని.. వాటికి సహజత్వాన్ని జోడించి తెరపై ఆవిష్కరిస్తే.. ఆ తరహా సినిమాలకు జనాలు బ్రహ్మరథం పడుతున్న రోజులివి. ఉదాహరణకు ‘బలగం’. ఇప్పుడు అదే కోవలో ‘యేవమ్‌’ అనే సినిమా రూపొందుతున్నది. తెలంగాణ ఒగ్గు కథా సాంప్రదాయాన్ని హైలైట్‌ చేస్తూ.. దర్శకుడు ప్రకాశ్‌ దంతులూరి ‘యేవమ్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథలో వచ్చే ఓ కీలక సన్నివేశంలో గాఢతను, సారాంశాన్ని ఒగ్గుకథ రూపంలో చెబితే బావుంటుదని ఈ ప్రయత్నం చేశామని, హిందూ సంప్రదాయంలోని గ్రామదేవతల గొప్పతనాన్ని ఈ ఒగ్గు కథలో వివరించడం జరిగిందని దర్శకుడు తెలిపారు. ఒగ్గు కథను ముఖ్య అంశంగా చేర్చిన తొలి కమర్షియల్‌ సినిమా తమదేనని ఆయన చెప్పారు. ఈ ఒగ్గుకథను రియల్‌ ఒగ్గుకథ కళాకారులతో చెప్పించడం జరిగిందని, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచే ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుందని ప్రకాశ్‌ దంతులూరి తెలిపారు. దివి చౌదరి, వశిష్ఠ సింహా, భరత్‌రాజ్‌, అషురెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం: కీర్తన శేషు, నీలేష్‌ మందలపు, నిర్మాతలు: నవదీప్‌, పవన్‌ గోపరాజు.

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page