top of page

రూ. 10 వేలలో 5జీ ఫోన్‌..


ఐక్యూ జెడ్‌ 9 లైట్‌ పేరుతో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకురావడం విశేషం. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐక్యూ జెడ్‌9 లైట్ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్‌ ఫన్‌టచ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ 14ని అందించారు.

ఇక ఈ ఫోన్‌ను ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్‌ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఈ ఫోన్‌ డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 6.57 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 840 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. బ్యాటరీ పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 15 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ కోసం ఇందులో వైఫై 5, బ్లూటూత్‌ 5.4, టైప్‌- సి యూఎస్‌బీ వంటి ఫీచర్లను అందించారు. కెమెరా విషయంలో కూడా కాంప్రమైజ్‌ అవ్వలేదు. ఇందులో 50 మెగాపిక్సెల్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇదులో సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఆప్షన్‌ను ఇచ్చారు. ధర విషయానికొస్తే ఐకూ జెడ్‌9 లైట్‌ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,499కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 11,499గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫరలో భాగంగా కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 500 ఇనస్టాంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఈ ఫోన్‌ అమ్మకాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page