top of page
Shiva YT

రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలకు శ్రీకారం 🌟🌍

ఆరుగ్యారంటీల్లో మరో రెండు హామీలకు శ్రీకారం చుడుతుంది తెలంగాణ ప్రభుత్వం. చేవేళ్ల సభలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తుంది. వర్చువల్‌గా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఈ పథకాలను లాంచ్‌ చేస్తారు. 🎉🔥



తెలంగాణ ప్రభుత్వం మరో రెండు పథకాలను ఇవాళ ప్రారంభించనుంది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మరో రెండు పథకాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీకారం చుడుతున్నారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు చేవెళ్లలోని ఫరా కాలేజ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ప్రారంభిస్తారు. 🎤👏

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తున్న మరో రెండు పథకాల్లో ఒకటి గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కాగా.. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తుండగా.. విశిష్ట అతిథిగా మల్లు భట్టి విక్రమార్క.. సభాధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. కామన్‌గా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ప్రారంభించాలకుంది కాంగ్రెస్. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ హైదరాబాద్ టూర్ రద్దు కావడంతో.. పథకాల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఇక్కడికి రావడం లేదు. అయితే ఢిల్లీ నుంచి పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వర్చువల్ హాజరై గ్యారెంటీలను లాంచ్‌ చేయనున్నారు ప్రియాంక గాంధీ. రెండు పథకాల అర్హతకు వైట్ రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టిన ప్రభుత్వం. 🌐💡

కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో.. ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో రెండు పథకాలను ప్రారంభిస్తుంది. తెల్ల రేషన్‌ కార్డు కలిగి.. 200 యూనిట్లలోపు కరెంట్‌ వాడే వారందరికీ మార్చి మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేయాలని నిర్దేశించారు. ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందించాలని, దీనిపై గ్యాస్‌ ఏజెన్సీలతో చర్చలు జరపాలని ఇప్పటికే సీఎం రేవంత్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటవెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 💼💰. ela aite

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page