top of page
Suresh D

మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం🇮🇳✨

దేశంలో మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

దేశంలో మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనే పార్లమెంటు ఆమోదం పొందినా.. ఇంకా అమల్లోకి రాని పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నేటి నుంచే భారత దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం ఈ సందర్భంగా వెల్లడించింది.2019 డిసెంబర్ 11 వ తేదీన ఈ పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందింది. దీనికి సంబంధించి అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా సంతకం చేశారు. అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిబంధనలు, విధివిధానాలు మాత్రం ఇప్పటివరకు కేంద్రం రూపొందించలేదు. తాజాగా ఈ సీఏఏను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

bottom of page