గుంటూరు కారం ట్రైలర్ ను జనవరి 7న రిలీజ్ చేశారు, రాత్రి 9.09 గంటలకు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక 24 గంటల్లో ఈ సినిమా రికార్డ్ స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకుంది. 24 గంటల్లో దాదాపు 40 మిలియన్ల మంది ఈ ట్రైలర్ ను చూశారు.
గుంటూరు కారం సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.
అలాగే గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జైరామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక జగపతి బాబు ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో మహేష్ చెప్పిన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ , ఎమోషన్ ప్రేక్షకులను అలరించాయి.
ఇక ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. గుంటూరు కారం ట్రైలర్ ను జనవరి 7న రిలీజ్ చేశారు, రాత్రి 9.09 గంటలకు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక 24 గంటల్లో ఈ సినిమా రికార్డ్ స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకుంది. 24 గంటల్లో దాదాపు 40 మిలియన్ల మంది ఈ ట్రైలర్ ను చూశారు. ఈ విషయాన్నిచిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్మీడియా వేదికగా తెలిపింది. ‘గుంటూరు కారం’ తర్వాత స్థానంలో సలార్ 24 గంటల్లో 32.58 మిలియన్ , లియో 31.91మిలియన్, బీస్ట్ 29.8మిలియన్, సర్కారు వారి పాట 26.77 మిలియన్, అజిత్ తెగింపు 25 మిలియన్, రాధేశ్యామ్ 23.3 మిలియన్, ఆచార్య 21.86మిలియన్, బాహుబలి 21.81మిలియన్, RRR 20.45 మిలియన్, KGF- 2 19.38 మిలియన్, బ్రో ది అవతార్ 19.25మిలియన్ వ్యూస్ తో లిస్ట్ లో ఉన్నాయి. 🎥✨