పాట్నా: ఇది నమ్మశక్యంగా లేదు, బీహార్లో రూప్‌చంద్ అనే వ్యక్తి 40 మంది మహిళలకు భర్త అని కనుగొన్నారు.
ఈ మహిళలు బీహార్‌లోని అర్వాల్ జిల్లాలోని రెడ్-లైట్ ప్రాంతంలో నివాసితులు.
కొంతమంది మహిళలు రూప్‌చంద్‌ను తమ తండ్రి, కొడుకుగా కూడా తెలిపారు. మహిళల ఆధార్ కార్డులపై తమ భర్త- పేరు రూపచంద్ పేరు కూడా రాసి ఉంది. ఇంతకీ ఈ రూప్‌చంద్ ఎవరనే విషయాన్ని ఆరా తీస్తే అశ్చర్యపోయే విషయం బయటపడింది.
రూప్‌చంద్ అంటే వ్యక్తి కాదని, రూపాయిని, వారు డబ్బును రూపచంద్ అని పిలుస్తారని తేలింది. ఇక్కడ నివసించే స్త్రీలు రూపాయిని తమ సర్వస్వంగా భావిస్తారు కాబట్టి వారందరూ తమ భర్త పేరు రూపచంద్ పేరును వ్రాస్తారు. ఏళ్ల తరబడి ఇక్కడిప్రాంతంలో నివసించే మహిళలకు శాశ్వత చిరునామా అంటూ లేదు.
పాటలు పాడుతూ..డ్యాన్సులు వేస్తూ జీవనం సాధించే వీళ్లు .. రూప్‌చంద్‌ను తమ బంధువుగా భావిస్తారు. ఈ ప్రాంతంలో ఉండేవారికి కులం అంటూ ఏదీ లేదని అధికారులు తేల్చారు.