top of page
Shiva YT

మేడారం జాతరకు 4,479 బస్సుల రైయ్..రైయ్..! బస్సుల కొరతతో నగరవాసుల అవస్థలు! 🚌👥

మేడారం జాతరకు 4,479 బస్సుల కేటాయింపు : ఈ జాతరకు వచ్చే భక్తులు వరంగల్‌ వరకూ రైలు లేదా బస్సుల్లో చేరుకోవాలి. అక్కడినుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వం 4,479 బస్సులను ఈ జాతర కోసం కేటాయించింది.

బుధవారం నుంచి ఆదివారం వరకు జరకు జరిగే జాతరకు 4,479 బస్సులు భక్తుల సౌకర్యార్ధం తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వీటితోపాటు పాఠశాల, కళాశాల బస్సుల్లాంటి ప్రైవేటు వాహనాలు కూడా మరో 1500 వరకు ఏర్పాటు చేసింది. ఇలా సుమారు 6 వేల బస్సులు ఐదు రోజుల పాటు మేడారం భక్తుల కోసం నడపనున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి బస్సులు నిర్ధిష్ట ప్రదేశాలకు చేరుకున్నాయి. బస్‌స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. మరోవైపు రైల్వే అధికారులు ఈసారి 30 ప్రత్యేక రైళ్లను మేడారం కోసం తిప్పుతున్నారు.

బస్సులు లేక నగరవాసుల తిప్పలు : 🚍👥 ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోతే సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహాలక్షి పథకంతో ప్రయాణికులు పెరిగిన క్రమంలో 90 శాతం మంది బస్సుల కోసం చూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 30 లక్షల మేర ఉంటోంది. ఇలాంటి సమయంలో.. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బస్సుల కొరత ఏర్పడటంతో గంటల కొద్ది ప్రయాణికులు బస్టాండ్‌లలో వేచి చూస్తున్నారు. బుధవారం నుంచి మిగతా బస్సులు కూడా వెళ్లిపోతే పరిస్థితి ఏంటని అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. 🕰️

bottom of page