నెదర్లాండ్స్‌లోని ఉత్తర సముద్ద్రంలో మూడు వేలకు పైగా లగ్జరీ కార్లతో వెళ్తోన్న షిప్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది 🔥🚢🆘 జర్మనీ నుంచి ఈజిస్ట్ షిప్‌లో సరఫరా చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది 🔥🚢🆘 ఈ ఘటనలో మెర్సిడెస్-బెంజ్, టయోటా, ఫోర్డ్ మోటర్స్, నిస్సన్ మోటర్, స్టెల్లాంటిస్ వంటి పలు బ్రాండ్లకు చెందిన కార్లు దగ్ధమైనట్లు సమాచారం 🔥🔥🔥 ఈ నెల 25వ తేదీ రాత్రి జర్మనీ ఓడరేవు బ్రెమెర్‌హావెన్ నుంచి ఈ షిప్ బయల్దేరిన కొద్ది సేపటికే షిప్‌లో మంటలు చెలరేగాయి 🔥🌊🚢
అమెలాండ్‌కు ఉత్తరాన 27 కి.మీ దూరంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది 🔥🆘🌊🚢 ప్రమాద సమయంలో షిప్‌లో 21 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 20 మంది స్వల్ప గాయాలతో ఓవర్‌బోర్డ్‌ల ద్వారా ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. మృతుడు భారత్ సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు 🔥💔🚢🆘 🚢🔥🆘డచ్ కోస్ట్‌గార్డ్, రెస్క్యూ షిప్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. కాగా నౌకలో ఉన్న 25 ఎలక్ట్రిక్ కారుల్లో ఒకదానిలో సేఫ్టీ బ్యాటరీ ద్వారా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 🚢🔥🆘🇳🇱🌊