top of page
Shiva YT

కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ సహా 34 మంది సస్పెన్షన్..🚨👥

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం కూడా రచ్చ కొనసాగింది. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన తర్వాత.. అధికార, విపక్షాల మధ్య మాటల వేడి కొనసాగుతోంది.

ఈ తరుణంలో సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ గందరగోళం మధ్య లోక్‌సభ స్పీకర్ 34 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సభలో నిరంతరం గందరగోళం సృష్టించడం, కుర్చీలో కూర్చోకుండా ఆందోళన చేయడంపై లోక్ సభ స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు 34 ఎంపీలపై ఈ సస్పెన్షన్ విధించారు. అంతకుముందు శుక్రవారం కూడా 13 మంది విపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. తాజాగా.. కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ సహా.. 34 మందిపై సస్పెన్షన్ విధిస్తూ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు వీరిపై సస్పెన్షన్ విధించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లోక్‌సభ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు సభ లోపల ప్లకార్డులు ప్రదర్శించడంతో ఈ చర్య తీసుకున్నారు. 🏛️🗣️✋

bottom of page