top of page
Suresh D

ఒక్క పాటకు 30 కోట్లా..🎵🔥

తమిళ్ డైరెక్టర్ శంకర్ అంటేనే భారీ సినిమాలు ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతాయి. జీన్స్, బాయ్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో లాంటి భారీ సినిమాలు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే శంకర్ సినిమాలు ఎంత భారీస్థాయిలో రూపుదిద్దుకుంటాయో.. ఆ సినిమాలోని పాటలు కూడా అంతేభారీ స్థాయిలో తెరకెక్కుతుంటాయి. తాజాగా లెజెండరీ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’లో ఒక పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను అలరించనున్నట్లు సమాచారం. రూ.30 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ పాటను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నామని, ఇది యాక్షన్ అడ్వెంచర్ కు హైలైట్ గా నిలుస్తుందని, విజువల్ గా ఆకట్టుకునే పాటలకు పెట్టింది పేరు దర్శకుడు శంకర్ అని, ఈసారి కమల్ హాసన్ కోసం బాగా ఖర్చు పెడుతున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. 


 

bottom of page