top of page
Shiva YT

💡 300 యూనిట్ల ఉచిత కరెంట్‌‌.. ప్రధాని మోదీ కీలక ట్వీట్

🇮🇳 ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకు సంబంధించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ పథకం ద్వారా దేశంలోని కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేసే సౌర ఫలాకాలను ఏర్పాటుచేయబోతున్నారు.

🏠 ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. గతంలో 40శాతం సబ్సిడీ ఇస్తే.. ఇప్పుడు దానిని 60శాతానికి పెంచారు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని ప్రజలు రుణంగా తీసుకోవచ్చు.

📢 తాజా బడ్జెట్‌లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ స్కీమ్‌ను ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. దీని ద్వారా కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు.

🌞 ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన కింద ఈ బెనిఫిట్ పొందొచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు.

🔗 ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానేనే ప్రజలు తమ పైకప్పులపై విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారు PMSY పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

💡 దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది తమ ఇళ్లలో సోలార్ ప్యానెల్స్‌ను పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారికి ఇందులో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను రూపొందిస్తోంది.

🌍 ఈ నేపథ్యంలో తాజాగా ఈ పథకంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దేశంలో స్థిరమైన అభివృద్ధి, ప్రజల శేయస్సు కోసం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

🏡 కోటి గృహాల్లో సౌర వెలుగులు నింపేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికోసం 75 వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా 300 యూనిట్ల ఉచిత కరెంట్ పొందవచ్చని ప్రధాని మోడీ అన్నారు. సౌర విద్యుత్ వినియోగం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది.

🌞 ఈ సోలార్ పానల్స్ తో లబ్ధిదారుడు తమ అవసరానికి మించి అధికంగా కరెంట్ ఉత్పత్తి చేస్తే.. దానిని SPV కొనుగోలు చేస్తుంది. ఆ డబ్బుల ద్వారా రుణాన్ని చెల్లిస్తారు. ఈ విధంగా 10 సంవత్సరాలలో మీ రుణాన్ని పూర్తిగా చెల్లిస్తారు. ఆ తర్వాత సోలార్ ప్యానెల్‌ను లబ్ధిదారుని పేరుకు బదిలీ చేస్తారు. 🌐

bottom of page