top of page
Suresh D

జయహో భారత్.. దేశమంతా అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు..🇮🇳✨

దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్‌. మువ్వన్నెల జెండా ముచ్చటపడేలా... ఎర్రకోట గర్వించేలా... గణతంత్ర దినోత్సవ వేడుకలకు..🇮🇳✨

ఏపీలో రిపబ్లిక్ డే వేడుకలు ఇలా..🇮🇳✨విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తోంది. గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. మళ్లీ సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆథిద్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామన్నారు. అలాగే.. రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామన్నారు జగన్‌. 

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు🇮🇳✨గణతంత్ర వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన.. పదేళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దెదింపారన్నారు తమిళిసై. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆమె.. వందరోజుల్లో అన్నిగ్యారంటీలను అమలు చేస్తామన్నారు. 

పబ్లిక్‌ గార్డెన్స్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు🇮🇳✨పబ్లిక్‌ గార్డెన్స్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలకు హాజరు కావడానికి ముందు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళ్లారు. అక్కడ అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. అమరవీరులకు నివాళి అర్పించారు. 

తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు ఇలా..🇮🇳✨హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది..గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు..రిపబ్లిక్ వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్ ను అధికారులు సిద్ధం చేశారు..సీఎంతో పాటు మంత్రులు IAS అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు..గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు..పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 

తన నివాసంలో జాతీయ జెండాను ఎగరేసిన సీఎం రేవంత్..🇮🇳✨తెలంగాణ CM రేవంత్‌ నివాసంలో రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్‌. 

దేశమంతా అంబరాన్నంటిన రిపబ్లిక్ డే వేడుకలు..🇮🇳✨రిపబ్లిక్‌ డే సందర్భంగా పంజాబ్‌లోని వాఘా సరిహద్దుల్లో దేశం మీసం మెలేసింది. తమ శక్తిని చూడండంటూ భారత సైనికులు రోషం, పౌరుషం చూపించారు. పందెం పుంజుల్లా కవాతు చేశారు. BSF సైనికులు చేసిన విన్యాసాలు శివ తాండవాన్ని తలపించాయ్‌. భారత సైనికుల శక్తిని కళ్లకు కట్టాయి. ప్రతిరోజు వాఘాలో బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం జరుగుతుంది. కానీ గణతంత్ర దినోత్సవం రోజు జరిగే వేడుకలు మాత్రం చాలాచాలా స్పెషల్‌. ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు. రెండు దేశాల సైనికులు ఎదురుపడి పరస్పరం సెల్యూట్ చేసుకోవడం చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.  

దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్‌. మువ్వన్నెల జెండా ముచ్చటపడేలా... ఎర్రకోట గర్వించేలా... గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది ఢిల్లీ. గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు, రోమాలు నిక్కబొడుచుకునేలా కవాతుతో శక్తిని చాటునున్నాయ్‌ త్రివిధ దళాలు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో త్రివిధ దళాలు కలిసి కవాతు చేయనున్నాయ్‌. అద్భుత యుద్ధ విన్యాసాలతో ఆకట్టుకోనున్నారు మన సైనికులు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తోంది. గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు.🇮🇳✨

bottom of page