top of page

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 26 గేట్లు ఎత్తివేత


నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు (Nagarjuna Sagar) వరద కొనసాగుతున్నద. ఎగువ నుంచి 3,12,093 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 309 టీఎంసీలు ఉన్నాయి. గరిష్ట నీటిమట్టం 590 అడుగులకుగాను 589.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టులోని 26 గేట్లలో ఎనిమిది గేట్లను పది అడుగుల మేర, మరో 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తివేశారు. దీంతో స్పిల్‌వే ద్వారా 2,63,168 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుండగా, ఎడమ కాలవుకు 8280 క్యూసెక్కులు, కుడి కాలవుకు 9500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 28,785 క్యూసెక్కుల నీరు వెళ్తున్నది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page