top of page
Suresh D

ఈ కుక్కలను పెంచుకోవడం నిషేధం..? 🚫🐕

దేశంలో పలు ప్రాంతాల్లో ఈ కుక్కల దాడి వలన ప్రజలకు తీవ్రమైన గాయాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటీవల పిట్‌బుల్ కుక్క దాడిలో గాయపడిన 17 నెలల చిన్నారి ఆస్పత్రి పాలైంది.

క్రూరమైన కుక్కల దాడుల కారణంగా అనేక సందర్భాల్లో మనుషులు మరణిస్తున్న నేపథ్యంలో రోట్‌వీలర్, పిట్‌బుల్, టెర్రియర్, వోల్ఫ్ డాగ్స్ , మాస్టిఫ్‌ల వంటి అనేక జాతుల కుక్కల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై నిషేధం విధించాలని కేంద్రం కోరింది. పెంపుడు కుక్కలు లేదా ఇతర ప్రయోజనాల కోసం అవి “మానవ జీవితానికి ప్రమాదకరమైనవి” అని పేర్కొంది.

దేశంలో పలు ప్రాంతాల్లో ఈ కుక్కల దాడి వలన ప్రజలకు తీవ్రమైన గాయాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇటీవల పిట్‌బుల్ కుక్క దాడిలో గాయపడిన 17 నెలల చిన్నారి ఆస్పత్రి పాలైంది. అంతేకాదు తన పొరుగింటి వ్యక్తి మీద కోపంతో ఓ చిన్నారిపై దాడి చేసేలా యజమని రెచ్చగొట్టడంతో 10 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇలా వివిధ సంఘటనలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కుక్కల వల్ల మనిషి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని…  పిట్‌బుల్ తరహా వివిధ క్రూరమైన శునకాలపై నిషేధం విధించాలని కోరింది.

నిషేధాల లిస్ట్

1. పిట్‌బుల్ టెర్రియర్ 2. తోసా ఇను 3. అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్ 4. ఫిలా బ్రసిలీరో 5. డోగో అర్జెంటినో 6. అమెరికన్ బుల్‌డాగ్ 7. బోయెస్‌బోయెల్ 8. కనగల్ 9. సెంట్రల్ ఆసియన్ షెపర్డ్ డాగ్ 10. కాకేసియన్ షెపర్డ్ డోగ్ సౌత్ రష్యన్ డాగ్ 11. టోర్ంజక్, 12. సర్ప్లానినాక్ 13. జపనీస్ టోసా మరియు అకిటా 14. మాస్టిఫ్స్ 15. రోట్‌వీలర్ 16. టెర్రియర్స్ 17. రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్ 18. వోల్ఫ్ డాగ్స్ 19. కానరియో 20. అక్బాష్ 21. మాస్కో గార్డ్ 22. కేన్ కోర్సో 23. బండోగ్

bottom of page