🗞️ సమాచారం ప్రకారం దాదాపు 18000 మంది భారతీయులు ఇజ్రాయిల్‌లో ఉన్నారు. 🌏 వీరిలో భారీ సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. 📚 ఇప్పటి వరకు భారతీయులెవరూ గాయపడినట్లు సమాచారం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 📢 గాయపడిన ఒక వ్యక్తితో మేము సంప్రదిస్తున్నాము, అతను ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. 📋
🏦 వెస్ట్ బ్యాంక్, గాజాలో చిక్కుకున్న భారతీయులు, AF C-17, C-230, IL-76 స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నాయని అరిందమ్ బాగ్చి చెప్పారు. ✈️ వెస్ట్ బ్యాంక్‌లో 12 మంది భారతీయులు, గాజాలో 3-4 మంది భారతీయులు కూడా ఉన్నారని తాము వారితో టచ్‌లో ఉన్నామని, వారిని తిరిగి తీసుకువస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. 🏢 పాలస్తీనాపై భారత్ తన విధానాన్ని పునరుద్ఘాటించిందని ఆయన అన్నారు. 🕊️ మానవతా చట్టాన్ని అనుసరించడం అంతర్జాతీయ బాధ్యత అని బాగ్చి అన్నారు. 🌍 దీనితో పాటు అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాడాల్సిన బాధ్యత ప్రపంచానికి ఉందని చెప్పారు. 🌍
🛫 ఆపరేషన్ అజయ్ ప్రారంభం: శాంతియుతంగా జీవిస్తున్న పాలస్తీనా సార్వభౌమాధికారం ఆచరణీయ రాజ్య స్థాపన కోసం ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష చర్చలను పునఃప్రారంభించాలని భారతదేశం కోరుకుంటుందని.. 🕊️ శాంతిని భారత్ కోరుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 🌍 మన పౌరుల సౌలభ్యం కోసం ఆపరేషన్ అజయ్ ప్రారంభించినట్లు ప్రతినిధి గురువారం తెలిపారు. 🛬 తొలి విమానం రాత్రి టెల్ అవీవ్ చేరుకుని ఈరోజు (శుక్రవారం) ఉదయం తిరిగి భారత్‌కు చేరుకుంటుంది. 🌄 ఇందులో దాదాపు 230 మంది భారతీయులు తిరిగి వస్తున్నారు. ✈️
💰 ప్రయాణికులు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు, భారతీయులు తిరిగి మన దేశానికి తీసుకుని వచ్చేందుకు వీలుగా ఈ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ✈️ ఎందుకంటే పోరాటం ప్రారంభమైన అక్టోబర్ 7న ఎయిర్ ఇండియా తన విమానాలను నిలిపివేసింది. 🌍 తిరిగి వచ్చే వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని.. వారి రిటర్న్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 💸🌏