ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) అనుబంధ సిట్రోన్ ఇండియా (Citroen India) తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు 2024-సిట్రోన్ సీ3 (2024 Citroen C3) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.6.16 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. సిట్రోన్ ఇండియా వెబ్ సైట్, లా మాయిసన్ సిట్రోన్ డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ నుంచి కార్ల డెలివరీ మొదలవుతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో మరింత ప్రీమియం లుక్‌తో యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు, ఫ్రెష్ బెల్స్, విజిల్స్ తో వస్తోంది.
సిట్రోన్ సీ3 (Citroen C3) కారులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, 3-పాయింట్ సీట్ బెల్ట్ విత్ రిమైండర్ ఫర్ ఆల్ సీట్స్ ఫీచర్లు జత కలిశాయి. ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ సీట్ యాంకర్స్ కూడా ఉంటాయి. కొత్తగా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డోర్స్ మీద పవర్ విండో స్విచెస్, ప్యాసింజర్లందరికీ ఫోల్డబుల్ గ్రాబ్ హ్యాండిల్స్, ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎంస్, ఓఆర్వీఎంస్‌పై టర్న్ ఇండికేటర్లు తదితర ఫీచర్లు జత చేశారు.
సిట్రోన్ సీ3 ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారులో 40 కనెక్టివిటీ ఫీచర్లతో కూడిన ‘మై సిట్రోన్ కనెక్టివిటీ (My Citroen Connectivity) షూట్ ఉంటుంది. రిమోట్ స్టార్ట్ స్టాప్ విత్ ప్రీ కండిషనింగ్, జియో ఫెన్సింగ్, రిమోట్ లాక్/ అన్‌లాక్, మార్కెట్ ప్లేస్ ఫ్యుయలింగ్ ఫీచర్లు ఉన్నాయి.
సిట్రోన్ సీ3 కారు మల్టీపుల్ పవర్ ట్రైన్ ఆప్షన్లు కలిగి ఉంది. 1.2 లీటర్ల ప్యూర్ టెక్ 82 నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (82 పీఎస్ విద్యుత్, 115 ఎన్ఎం టార్క్), 1.2 లీటర్ల జెన్-3 ప్యూర్ టెక్ 110 టర్బో పెట్రోల్ ఇంజిన్ (110 పీఎస్ విద్యుత్, 190 ఎన్ఎం/ 205 ఎన్ఎం టార్క్) ఉంటాయి. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, టర్బో పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో వస్తోంది సిట్రోన్ సీ3. కొత్తగా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ప్రవేశ పెట్టారు. మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాన్జా వంటి కార్లకు సిట్రోన్ సీ3 గట్టి పోటీ ఇవ్వనున్నది.