భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబయిలోని సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో 2,409 యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆగస్టు 29, 2023వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 👨💻 క్యారేజ్ అండ్ వ్యాగన్ (కోచింగ్) వాడి బందర్ (ముంబయి), పరేల్ వర్క్‌షాప్, మాతుంగ వర్క్‌షాప్, ఎస్ అండ్ టీ వర్క్‌షాప్ (బైకుల్లా), కల్యాణ్ డీజిల్ షెడ్, క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో (నాగ్‌పుర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో (సోలాపూర్), కుర్లా డీజిల్ షెడ్, సీనియర్ డీఈఈ (టీఆర్‌ఎస్ కల్యాణ్, కుర్లా), క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో (భుసవల్), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (భుసవల్), టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్ (భుసవల్), క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో (పుణె), ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్ (భుసవల్), మన్మాడ్ వర్క్‌షాప్ (భుసవల్), డీజిల్ లోకో షెడ్ (పుణె), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (నాగ్‌పుర్), కుర్దువాడి వర్క్‌షాప్ (సోలాపూర్) 🏢
పదో తరగతిలో సాధించిన మార్కులు, సంబంధిత ఐటీఐలో వచ్చిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 9, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.100 అప్లికేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు. 📆📋🩺