మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు(Mollywood #MeToo) జరుగుతున్నట్లు ఇటీవల హేమ కమీషన్ తన రిపోర్టులో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో 17 కేసులు నమోదు అయ్యాయి. నటులు, నిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ కేసు దాఖలు చేసినవారు ఆరోపించారు. దీంతో అమ్మా సంస్థను రద్దు చేశారు. అనేక మంది సినీ తారలు, నిర్మాతలను .. లైంగిక వేధింపుల కేసులో విచారించనున్నారు.
తాజాగా నటి సోనియా మలహార్ ఫిర్యాదు చేసింది. 2013లో ఓ ఫిల్మ్ సెట్‌లో ఓ నటుడు తనను వేధించినట్లు ఆమె ఆరోపించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న మీటూ ఆరోపణలపై కేరళ సర్కారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఆ బృందానికి నటి సోనియా ఫిర్యాదు చేసింది. నటుడు జయసూర్యతో తనకు లింకు ఉన్నట్లు ఆరోపణలు చేయరాదు అని మీడియాను కోరిందామె.
లైంగిక ఆరోపణలు చేసిన నటి మిను మునీర్ కు బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎం ముకేశ్, జయసూర్య, మణియన్‌పిల్లై రాజు, ఇడవేల బాబు వేధించినట్లు గతంలో ఆమె ఆరోపించారు. బెదిరంపునకు చెందిన మెసేజ్‌ను ఆమె తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సిట్ సభ్యులు ఆమె చేసిన ఫిర్యాదుపై వాంగ్మూలం తీసుకోనున్నారు.