top of page
MediaFx

13 మంది బాలికలపై లైంగిక వేధింపులు..


తమిళనాడులో కృష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎన్‌సీసీ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని నమ్మబలికిన నిందితులు.. ఓ బాలికపై లైంగిక దాడి చేయడంతో పాటు మరో 12 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పాఠశాల ప్రిన్సిపాల్‌, ఇద్దరు టీచర్లతో సహా 11 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఎన్‌సీసీ క్యాంపు సందర్భంగా బాలికలకు స్కూల్‌ ఆడిటోరియంలో, బాలురుకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వసతి ఏర్పాటు చేశారు. పిల్లలను పర్యవేక్షించేందుకు ఒక్క టీచర్‌ను కూడా నియమించలేదు. దీన్ని అదనుగా తీసుకొన్న నిందితులు ఓ బాలికపై లైంగిక దాడి చేయడంతో పాటు మరో 12 మందిపై వేధింపులకు పాల్పడ్డారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తమపై లైంగిక వేధింపులు జరిగిన విషయాన్ని బాధిత బాలికలు స్కూల్‌ యాజమాన్యానికి తెలిపారని, అయితే వారు పోలీసులకు సమాచారం అందించకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని కృష్ణగిరి జిల్లా ఎస్పీ పీ తంగదురై తెలిపారు.

బాలికను నిర్బంధించి.. 5 రోజులు గ్యాంగ్‌ రేప్‌ న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. 13 ఏండ్ల బాలికను ఐదు రోజులపాటు నిర్బంధించి ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అప్పర్‌ సుబన్‌సిరి జిల్లా డపోరిజో పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసు సూపరింటెండెంట్‌ థూటన్‌ జంబ ఆదివారం మాట్లాడుతూ, ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కోర్టు వీరికి జ్యుడిషియల్‌ కస్టడీ విధించిందన్నారు. వీరంతా 20-30 ఏళ్ల మధ్య వయస్కులని చెప్పారు.

యూపీలో దళిత నర్సుపై రేప్‌ మొరాదాబాద్‌: యూపీలోని మొరాదాబాద్‌లో ఓ దళిత నర్సుపై(20) ఆమె పనిచేస్తున్న ప్రైవేట్‌ దవాఖాన వైద్యుడు లైంగిక దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు ఆదివారం విధులకు వెళ్లారు. అర్ధరాత్రి మెహనాజ్‌ అనే నర్సు బలవంతంగా ఆమెను దవాఖానలోని మొదటి అంతస్తులోని ఒక గదిలోకి తీసుకెళ్లి తాళం వేశారు. అనంతరం షానవాజ్‌ ఆ గదిలోకి వెళ్లి నర్సును రేప్‌ చేశాడు. కులం పేరుతో దూషించి, చంపేస్తానని బెదిరించాడు.


bottom of page