top of page

📱 వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌..🌟

ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైకా మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కావడం విశేషం. దీనికి ప్రధాన కారణం యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడమే.

యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందించడంతో పోటీ ఎంత ఉన్నా వాట్సాప్‌కు యూజర్లు దూరం కావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఫొటోలు, వీడియోలు షేరింగ్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే వాట్సాప్‌ హెచ్‌డీ క్వాలిటీతో కూడిన ఫొటోలు/ వీడియోలను షేర్‌ చేసుకోవడానికి వీలుగా గతేడాది 2 జీబీ ఫైల్‌ షేరింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే పక్కన ఉన్న వారికి ఫొటోలు, వీడియోలు పంపించుకోవచ్చు. ఈ ఫీచర్‌ అచ్చంగా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ‘నియర్‌బై షేర్‌’, ఐఓఎస్‌ ‘ఎయిర్‌ డ్రాప్‌’ తరహాలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉంది. పూర్తికాగానే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాబీటా ఇన్ఫో తెలిపింది. 📸📹

Comments


IndiaFx collection for you...

Related Products

bottom of page