top of page

త‌మ్ముడికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి


జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా సినీ రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు మెగా అభిమానులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న త‌మ్ముడు పుట్టిన రోజు సంద‌ర్భంగా బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ ప్ర‌త్యేక పోస్ట్ పెట్టాడు. ”కళ్యాణ్ బాబు… ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ!” అంటూ మెగాస్టార్ రాసుకోచ్చాడు. కాగా ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.



コメント


IndiaFx collection for you...

Related Products

bottom of page