top of page
MediaFx

రామాయణం రాసిన హనుమంతుడు.. కానీ అది ఏమైంది..?


రామాయణం ఎన్నిసార్లు చదివినా చదవాలనిపించే అద్భుతమైన కావ్యం.రామాయణం అన్ని భాషల్లోను, అన్ని ప్రాంతాలలోను ఎంతో ఆదరణీయమైన, పూజనీయమైన కావ్యం. ఇతర దేశాల్లోనూ రామాయణం గురించి అనేక కథలు ఉన్నాయి . రామాయణాన్ని ఎవరు రచించారు అనగానే తడుముకోకుండా ఠక్కున వాల్మీకి మహర్షి అని పేరు చెప్పేస్తారు. అయితే రామాయణాన్ని వాల్మీకి మహర్షి మాత్రమే కాదు శ్రీరాముని పరమ భక్తుడైన ఆంజనేయుడు కూడా రచించాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. శ్రీరాముడు రావణుడితో యుద్ధం గెలిచిన తర్వాత హనుమంతుడు ఒక పర్వతానికి వెళ్లి తన గోళ్ళతో రామాయణం రాయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న వాల్మీకి హనుమంతుడిని దాని గురించి అడిగాడు.హనుమంతుడు వెంటనే వాల్మీకి మహర్షిని తన భుజాలపై ఎక్కించుకొని అతను రాసిన రామాయణాన్ని చూపించి ఎలా ఉందో చెప్పమని మహర్షి అభిప్రాయాన్ని అడిగాడు. అప్పుడు వాల్మీకి కళ్ళనిండా నీళ్లతో అద్భుతంగా ఉంది. చాలా పరిపూర్ణమైనదని అన్నాడు. అలాగే ఇక “నా రామాయణం గురించి ఎవరు పట్టించుకుంటారని” అన్నాడట. ఇది విన్న హనుమంతుడు మరో ఆలోచన లేకుండా తన రాసిన రామాయణాన్ని నాశనం చేశాడు. అలా హనుమంతుడు రాసిన రామాయణం వెలుగులోకి రాకుండానే నాశనం అయిపోయింది.


Comments


bottom of page